మునుగోడు లో టీఆర్ఎస్ విజయం ఖాయం

మోత్కూరు అక్టోబర్ 12 జనంసాక్షి : నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం ఖాయమని మోత్కూరు మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు, రాగిబావి సర్పంచ్ రాంపాక నాగయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టుల కోసమే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీజేపీ లో చేరారని తెలిపారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిన రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు ఓడించడం ఖాయమన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే టిఆర్ఎస్ ప్రభుత్వంపై మునుగోడు ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మునుగోడు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికను రూపొందించారని త్వరలో అది అమలు చేస్తారని పేర్కొన్నారు.