మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కడప,జూలై9(జనం సాక్షి): కడపలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జిఒ నెంబరు 151 అమలు చేయాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి జిల్లాలో ఆందోళన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిపై కమిషనర్‌కు వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు. జిఒ నెంబరు 279 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయా లని కోరారు. ప్రతి నెలా ఐదవతేదీ వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు. పిఎఫ్, ఇఎస్‌ఐ చెల్లించాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు బకాయిపడ్డ వేతనాల అరియర్స్ ఇవ్వాలని కోరారు. కార్మికులు ఇళ్లు, ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మామిళ్లపల్లె శానిటేషన్ వర్కర్లకు అందరితో సమానంగా జీతాలు ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. పర్మనెంట్ కార్మికులకు జిపిఎఫ్ అకౌంట్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.