మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ఐదు రోజులుగా కొనసాగుతున్న ర్యాలీలు నిరసన కార్యక్రమాలు
ప్రభుత్వ ఉద్యో గులుగా గుర్తించని పక్షంలో సెప్టెంబర్ ఒకటి నుంచి విధులు బహిష్కరిస్తాం
మున్సిపాల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి చెన్నయ్య
వికారాబాద్ రూరల్ ఆగస్టు 27 జనం సాక్షి
మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వివిధ రంగాల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి పర్మినెంట్ చేయాలని మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి చెన్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని విధుల గుండా శాంతియుత ర్యాలీ నిర్వహించి ఒక ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా అటువంటి కష్ట కాలంలో సైతం బెదరకుండా ప్రజలందరికీ సేవలు అందించామని అప్పట్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులను దేవుళ్ళతో సమానం అని పోల్చిన నాయకులు ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎందుకు పట్టించుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు గత 20 సంవత్సరాల నుండి చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నావు తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని ఆయన సూచించారు లేని పక్షంలో సెప్టెంబర్ 1 నుంచి విధులు బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు దావూద్ సంఘం నాయకులు వై శంకర్ వినోద్ కుమార్ చందర్ సింగ్ కృష్ణ సలీం వివిధ రంగాల్లో పనిచేస్తున్న మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు