మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు వెడల్పు కొలతలలో అవకతవకలు

 

నేరేడుచర్ల జనంసాక్షి న్యూస్.మున్సిపాలిటీ పరిధిలోని పాత నేరేడుచర్లకు వెళ్లే రోడ్డు వెడల్పులో అవకతవకలు జరుగుతున్నాయని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి ఆరోపించారు.శుక్రవారం రోడ్డు పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లిన ఆయన పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ
రోడ్డు కాంట్రాక్టర్ కొలతల విషయంలో ఎవరిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని,రోడ్డు మొత్తం వెడల్పు 40 ఫీట్లు కాగా అందులో డాంబర్ రోడ్డు 23 ఫీట్లు వేయాలని,అలా కాకుండా కల్వర్టులు ఉన్న దగ్గర రోడ్డు వెడల్పు తక్కువగా వేస్తున్నాడని,రోడ్డు వెడల్పులో కరెంటు స్తంభాలు తీయకుండా, కల్వర్టులు తీయకుండా,ఒక దగ్గర వెడల్పు ఒక దగ్గర తక్కువగా రోడ్డు వేస్తున్నారని,ఆరోపించారు.
పనులలో నాణ్యత లోపించిందని అన్ని సరి చేసేంతవరకు పనులు ఆపాలని, రోడ్డు వేసే క్రమంలో కనీసం స్థానిక కౌన్సిలర్లకు సైతం సమాచారం లేకుండా ఇష్టానుసారంగా కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డాడు.
రోడ్డు ఇరువైపుల ఇంటి యజమానులు ఇప్పటికే సగం ఇళ్లను కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని,ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్,చైర్మన్ స్పందించి వెంటనే రోడ్డు కాంట్రాక్టర్ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో
కౌన్సిలర్లు బచ్చలకూరి ప్రకాష్, నూకల సుగుణ,రామచంద్రారెడ్డి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.