మున్సిపాల్ కమిషనర్ ను సస్పెండ్ చెయ్యాలి – సిపిఐ డిమాండ్
-మిషన్ భగీరథ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి
– చనిపోయిన వారి కుటుంబాలకు 25లక్షల పరిహారం ఇవ్వాలి
గద్వాల రూరల్ జులై 09 (జనంసాక్షి):- గద్వాల మున్సిపాలిటీలో కలుషిత మంచినీరు తాగి వందలాది మంది అస్వస్థతకు గురైతే సమస్యనుతప్పుదోవ పట్టించేవిధంగా మాట్లాడిన మున్సిపాల్ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. కలుషిత మంచినీరు త్రాగి అస్వస్థతకు గురై మరణించిన సంఘటన పట్ల సీపీఐ స్పందించిది.దీనిపై సీపీఐ బృందం శనివారం నాడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారితోపాటు వారి కుటుంబ సభ్యులను కలసి వివరాలు తెలుసుకొని బాధితులను పరామర్శించారు. అనంతరం హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ తో చర్చించారు..ఆతర్వాత మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు… ఈసందర్బంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ జరిగిన సంఘటన తీవ్ర నిర్లక్ష్యనికి ఇదొక నిదర్శనం అన్నారు ముమ్మాటికీ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ అధికారుల వైఫల్యమేనన్నారు. ఇంతమంది కలుషిత నీరు త్రాగి అస్వస్థతకు గురై మరణిస్తే కమిషనర్ పచ్చి అబద్దాలు మాట్లాడి సమస్యను పక్కదోవ పట్టించి ప్రజలు మరల నీరు త్రాగి ఇంకా ఎక్కువ మంది అస్వస్థతకు గురికావటానికి ఆజ్యం పోశారన్నారు. ఇలాంటి కమిషనర్ విధుల్లో ఉండటానికి వీళ్లేదని వేంటనే ప్రభుత్వం సస్పెండ్ చేయాలన్నారు అలాగే జరిగిన సంఘటన పట్ల సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేసి మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారుల పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలన్నారు,మున్సిపాలిటీ అధికారుల పరివేక్షణ లోపం వల్ల మిషన్ భగీరథ అధికారుల లోప భూఇష్టమైన పనులవల్ల నేడు ప్రజల మరణాలకు కారణం ఇదే అన్నారు. చనిపోయిన వారికుటుంబలకు ఒక్కొక్కరికి 25లక్షల రూపాయలపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మంచినీటి పైపులను డ్రైనేజిలకు దూరంగా కనెక్షన్ లు చేపట్టాలన్నారు.పట్టణంలో ఎక్కడ పడితే ఎక్కడ ఇట్టమొచ్చినట్లు డ్రైనేజిని విధ్వంసం చేసి నీరు వెళ్లకుండా చిన్నదానికి పెద్దదానికి బిల్లులు చేసుకొని తినటానికే ఈ ప్రమాద ప్రయత్నలని విమర్శించారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఇంకా మెరుగైన వైద్య ఇతర సహాయసౌకర్యాలు కల్పించి అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోపాలరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నరసింహ, ఎఐటియుసి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రంగన్న, సత్య రాజు పరుషరాము, కరెప్ప, ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రవీణ్, హన్మష్ తదితరులు పాల్గొన్నారు.