ముస్తాబాద్ మండలంలో విద్యాసంస్థల బంద్
ముస్తాబాద్ జులై 20 జనం సాక్షి
వామపక్ష విద్యార్థి సంఘాలు నేడు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పాఠశాలల మరియు జూనియర్ కళాశాల బందు ముస్తబాద్ మండలంలోని గూడెం,కొండపుర్ గ్రామాలలోనీ ప్రభుత్వ ప్రాథమిక,ఉన్నత పాఠశాలలో జరిగింది.ఈ సందర్భంగా పిడిఎస్యు మండల నాయకుడు కొమ్ము అభిషేక్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇంకా ప్రభుత్వం అందించాల్సిన దుస్తులు పాఠ్యపుస్తకాలు అందించడంలో తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మిస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని తక్షణమే విద్యారంగ సమస్యలన్నీటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దినేష్, వినయ్, శుష0త్,అరుణ్,రాజు, సజిత్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.
