ముస్లిం కాబట్టే నా కొడుకును వేధిస్తున్నారు..
– బిడ్డా.. లొంగిపో
– ఖాలీద్ తండ్రి
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 19(జనంసాక్షి):అఫ్జల్ గురు వర్ధంతి కార్యక్రమం నిర్వహించి జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ పదిరోజులుగా పరారీలో ఉన్న జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు ఉమర్ ఖాలీద్‌ను అతడి తండ్రి సయ్యద్ ఖాసిం ఇల్యాస్ గట్టిగా వెనకేసుకొచ్చారు. మూడు దశాబ్దాల క్రితం తనకు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా సభ్యత్వం ఉందని తన కుమారుడిపై ఉగ్రవాది అనే ముద్ర వేయడం తగదని చెప్పారు. తన కుమారుడు తప్పు చేశాడా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుందన్నారు. పరారీలో ఉన్న తన కుమారుడు ఖాలీద్‌ను లొంగిపోవాలని ఇల్యాస్ సూచించారు. ముస్లిం కాబట్టే ఖాలిద్‌ను వెంటాడుతున్నారని ఇల్యాస్ ఆరోపించారు. ఖాలిద్ లెఫ్టిస్ట్ అని, జాతి వ్యతిరేకి కాదని ఇల్యాస్ చెప్పుకొచ్చారు.