ముస్లిం నిరుపేద యువతికి బీరువా బహుకరణ
పరకాల (జనం సాక్షి, జూన్ 17) :
పరకాల పట్టణములోని ”హజ్రత్ అలీ బైతుల్‌మాల్” ఛారిటబుల్ కమిటి, పరకాల వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు ఎం.డి.గౌసొద్దీన్ ఖాద్రి, ఎం.ఏ.షరీఫ్ (బాబా) ఆధ్వర్యములో ఆదివారం రోజున పరకాల పట్టణములోని పాత వాటర్ ట్యాంక్ పరిధిలో నివాసం ఉంటున్న ముస్లిం నిరుపేద ఎం.డి.అంకూస్ – సర్దార్ బీ దంపతుల కూతురు వివాహానికి బైతుల్‌మాల్ నిధుల నుండి బీరువా బహుకరించడం జరిగినది. ఈ సందర్భంగా ముస్లిం యూత్ మేనేజింగ్ కమిటి అధ్యక్ష కార్యదర్శులు ఎం.డి.హాజి, ఎం.డి.బాయాబాని మాట్లాడుతూ ముస్లిం నిరుపేదల సంక్షేమం కోసం అక్టోబర్ 2010 లో ఏర్పాటైన బైతుల్‌మాల్ కమిటి నేటికి పలు అనాధ, నిరుపేద ముస్లిం యువతుల పెండ్లి శుభ కార్యాలలో మరియు ముస్లిం నిరుపేద కుటుంబాల అశుభ కార్యక్రమాలలో తమవంతు సహాయ సహకారం అందించటం జరుగుతుందని అలాగే తమ బైతుల్‌మాల్ కమిటికి సహకరిస్తున్న ముస్లిం లందరికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బైతుల్‌మాల్ కమిటి కార్యవర్గ సభ్యులు ఎం.కె.పాషా ఖాద్రి, ఎం.డి.యాకూబ్, ఎం.డి.అంకూస్ ఖాద్రి, ఎం.డి.యాకూబ్, కోశాధికారి ఎం.ఏ.కలీమ్, అల్తాఫ్ హుస్సేన్, ఎం.డి.సలీం ఖాద్రి, అల్‌హాజ్ ఎం.డి.జిలానీ పటేల్, సయ్యద్ అన్వర్, ఎం.డి.సాబీర్, ఎం.డి.రహీం, ఎం.కె.తాజొద్దీన్, ఎం.డి.ముస్తఫా, ఎం.ఎ.కలీం, ఎం.డి.సలీం, ఎం.డి.పాషా, ఎం.డి.అహ్మద్, సయ్యద్ పాషా తదితరులు పాల్గొన్నారు.