మూట గట్టుకుంటున్న ఓటములు
రియో డి జనీరో,ఆగస్టు 12(జనంసాక్షి): ఒలింపిక్స్‌లో ఏడో రోజూ భారత క్రీడాకారుల ఓటముల పరంపర కొనసాగుతోంది. షూటింగ్‌లో గగన్ నారంగ్, చైన్‌సింగ్, ఆర్చరీలో అతాను, బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడీ ఓటమి చవిచూశారు.
2-1తో జ్వాల-అశ్విని ఓటమి
బ్మాడ్మింటన్ మహిళల డబుల్స్ గ్రూప్ దశలో తాము ఎదుర్కొన్న రెండో మ్యాచ్‌లోనూ గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడీ ఓటమి చవిచూసింది. నెదర్లాండ్స్ ద్వయం మస్కెన్స్ ఇఫీ, పీక్ సెలీనాతో జరిగిన మ్యాచ్‌లో 16-21, 21-16, 17-21తో పరాజయం పాలయ్యారు.
అతాను పోరాడినా..
అతానుదాస్ ఓటమితో రియోలో భారత ఆర్చర్ల కథ ముగిసింది. పురుషుల వ్యక్తిగత రికర్వ్ ప్రిక్వార్టర్స్‌లో అతాను కొరియా క్రీడాకారుడు లీ సియన్‌గ్యన్‌తో జరిగిన పోరులో 4-6తో ఓటమి చవిచూశాడు. తొలిసెట్‌ను 28-30తో కోల్పోయిన అతాను రెండోసెట్‌లో 30-28తో గెలిచి స్కోరు సమం చేశాడు. ఇక మూడో సెట్లో ప్రత్యర్థులిద్దరూ 27-27 చేయడంతో చెరో పాయింటు పంచుకున్నారు. అయితే నాలుగో సెట్‌ను 27-28తో చేజార్చుకున్న అతాను కీలకమైన ఐదో సెట్‌లో 28-28తో స్కోర్ సమం చేయడంతో ఓటమి ఎదుర్కోక తప్పలేదు.
మహిళా ఆర్చర్లు బాంబేలా దేవి, దీపిక కుమారి గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచుల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అతాను ఓటమితో రియోలో భారత ఆర్చర్ల పోరు ముగిసింది.
విఫలమైన గగన్ నారంగ్
లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం తీసుకొచ్చిన గగన్ నారంగ్ రియో ఒలింపిక్స్‌లో మళ్లీ.. విఫలమయ్యాడు. పురుషుల వ్యక్తిగత 50విూ. రైఫిల్ ప్రోన్ అర్హత పోరులో 623.1 స్కోరు సాధించి 13వ స్థానంలో నిలిచాడు. ఆరు సిరీసుల్లో వరుసగా 104.7, 104.4, 104.6, 103.0, 104.0, 102.4 స్కోరు చేశాడు. మరో షూటర్ చైన్‌సింగ్ 619.6తో 36వ స్థానంలో నిలిచాడు. తొలి 8 స్థానాల్లో నిలిచిన వారే ్గ/నైల్‌కు చేరుకుంటారు. ఇకపోతే ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ల కథ ముగిసింది. పురుషుల వ్యక్తిగత రికర్వ్ ప్రిక్వార్టర్స్‌లో అతానుదాస్ పోరాడి ఓడాడు. కొరియా క్రీడాకారుడు లీ సియన్‌గ్యన్‌తో జరిగిన పోరులో 4-6తో ఓటమి చవిచూశాడు. తొలిసెట్‌ను 28-30తో కోల్పోయిన అతాను రెండోసెట్‌లో 30-28తో గెలిచి స్కోరు సమం చేశాడు. ఇక మూడో సెట్లో ప్రత్యర్థులిద్దరూ 27-27 చేయడంతో చెరో పాయింటు పంచుకున్నారు. అయితే నాలుగో సెట్‌ను 27-28తో చేజార్చుకున్న అతాను కీలకమైన ఐదో సెట్‌లో 28-28తో స్కోర్ సమం చేయడంతో ఓటమి ఎదుర్కోక తప్పలేదు.మహిళా ఆర్చర్లు బాంబేలా దేవి, దీపిక కుమారి గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచుల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అతాను ఓటమితో రియోలో భారత ఆర్చర్ల పోరు ముగిసింది.