మూడవ రోజుకు చేరుకున్న విఆర్ఏల రిలే నిరాహార దీక్షలు

సూర్యాపేట టౌన్(జనంసాక్షి) : రాష్ట్ర విఆర్ఏ జెఏసి పిలుపు మేరకు జిల్లాలోని విఆర్ఏలు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహర దీక్షలు శుక్రవారం నాటికి మూడవ రోజుకి చేరుకున్నాయి.సీఎం కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు.రాష్ట్రంలో ఉన్న వేల మంది వీఆర్ఏలకు అన్యాయం జరగకుండా అందరికి పే స్కేల్ వర్తింపజేస్తామని, అర్హత గల విఆర్ఏ లకు ప్రమోషన్స్ ఇస్తామని, 55 ఏళ్లు పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి 22 నెలలు కావస్తున్న తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.విఆర్ఏలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి,తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ని కోరారు.తమకు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర విఆర్ఏ జేఏసీ కో కన్వీనర్ షేక్ మహమ్మద్ రఫి, రాష్ట్ర విఆర్ఏల ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మళ్ళ నరసింహారావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్ గావాస్కర్, అక్కినేపల్లి శ్రీను, రాష్ట్ర విఆర్ఏల సంఘ కోశాధికారి గొబ్బి నరసయ్య , జిల్లా విఆర్ఎల జేఏసీ చైర్మన్, అంజెపల్లి నాగమల్లేష్ , జిల్లా విఆర్ఏ జేఏసీ సెక్రటరీ మామిడి సైదులు, జిల్లా జేఏసీ కో చైర్మన్, గోరుగంటి మధుసూదన్ రావు, జిల్లా జేఏసీ కన్వీనర్ మల్లయ్య , వీఆర్ఏల జిల్లా అధ్యక్షులు వెంకన్న, కో కన్వీనర్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు