మూసీ  తొలిదశకు లైన్‌క్లియర్

` ప్రాజెక్టు పనులకు రూ.7,055 కోట్లు
` తొలిదశలో హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు పనులు
` తొలి 5 కి.మీ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశం
` ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ద్వారా నిధులు
` కేబినేట్ సబ్‌కమిటీ భేటీలో నిర్ణయం
హైదరాబాద్(జనంసాక్షి): మÖసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టును మొత్తం 55 కిలోవిÖటర్ల మేర 5 దశల్లో అభివృద్ధి చేపట్టనున్నారు. ఫేజ్`1కు 7,055 కోట్ల రూపాయల వ్యయం అంచనా వేశారు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధుల కోసం సాంకేతిక, ఆర్థిక చర్చలు పూర్తి అయ్యాయి. ప్రజా భవన్‌లోమూసీనది పునరుజ్జీవనం ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.మూసీపునరుజ్జీవనం ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతోనే అమలు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజల ఆస్తులకు నష్టం లేకుండా ప్రాజెక్టును రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అలైన్‌మెంట్ మార్పులు చేసి నిర్మాణాలపై ప్రభావం తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి 5 కిలోవిÖటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. నదిలోని చెత్తను తొలగించి, రివర్ బెడ్ ప్రొఫైలింగ్‌ను ప్రభుత్వం చేపట్టనుంది. వరద నియంత్రణకు రిటైనింగ్ వాల్స్‌ను నిర్మించనున్నారు.మూసీరెండు వైపులా రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, నీటి నిల్వ కోసం బ్యారేజీలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు. నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 55 కి.విÖ. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉప్పల్ భగాయత్ నుంచి గౌరెల్లి వరకు విస్తరణకు డీపీఆర్‌ను తయారీకి నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు వివరాలను నగరవ్యాప్తంగా ప్రచారం చేయాలని సబ్ కమిటీ ఆదేశించింది. బస్టాండ్లు, ప్రధాన రోడ్లు, థియేటర్లలో ప్రచార వీడియోలు ప్రదర్శించనున్నారు. 2026 ఆగస్టు నాటికి పనులు ప్రారంభించడం లక్ష్యంగా నిర్ణయించారు. డిసెంబర్ 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ సాంకేతిక పర్యవేక్షణకు సహకారం తీసుకోనున్నారు. నిర్మాణాలపై ప్రభావం లేని 5.కి.విÖ మేర పనులు ప్రారంభించాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. నిర్మాణాలపై తక్కువ ప్రభావం పడేలా అలైన్‌మెంట్ మార్చాలని మంత్రులు సూచించారు.మూసీప్రాజెక్టు పనులను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించి 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా చేపట్టాలన్నారు. వర్షాకాలంలో పనులకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.మూసీపై రబ్బర్ డ్యామ్ నమÖనాలను ఈ సందర్భంగా ఉపసంఘం పరిశీలించింది.