మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీటీసీ అనిల్ జాధవ్.
నెరడిగొండ సెప్టెంబర్22(జనంసాక్షి):
మండలంలోని లింగట్ల గ్రామానికి చెందిన జాదవ్ సామ్ రావు తండ్రి రెడ్యానాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుకున్న మండల జడ్పిటిసి అనిల్ జాదవ్ బాధితులఇంటికి వెళ్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.వారి పవిత్రఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కిషోర్ సర్పంచ్ సబ్లె సవర్ణ అంజలి మాజీ పీఏసీఎస్ చైర్మన్ నానక్ సింగ్ సర్పంచ్ రమేష్ ధరవశింగ్ కేవల్ సింగ్ బలిరామ్ దేవరావ్ ప్రకాష్ సమీర్ గగణేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.