మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 19, ( జనం సాక్షి ): మండలంలోని శివునిపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన డ్రాయింగ్ టీచర్ ,లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు మొగుదుంపురం ఉపేందర్ సతీమణి మొగుదుంపురం కళావతి (55 ) మృతిచెందడం జరిగింది. విషయం తెలుసుకున్న తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి,ఎంఎల్ఏ డాక్టర్ తాటికొండ రాజయ్య అక్కడికి చేరుకుని కళావతి పార్థివదేహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మృతు రాలి కుటుంబాన్ని పరామర్శించి వారికి తన ప్రగా ఢ సానుభూతి సంతాపం తెలిపారు.పరామర్శించి న వారిలో ఎంఎల్ఏ రాజయ్య తో పాటు జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీటీసీ గుర్రం రాజు,నాయకులు కందులగట్టయ్య,సత్యం, ఉపేందర్,బైరీబాలరాజు,మొగుదుంపు రంకిషోర్,తదితరులు పాల్గొన్నారు.