మెక్సికోకు అమెరికా ఆపన్నహస్తం

85లక్షల వ్యాక్సిన్‌ల పంపిణీకి హావిూ
వాషింగ్టన్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): పొరుగు దేశం మెక్సికోలో కరోనా మూడో వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా ఆపన్న హస్తం అందజేసింది. మెక్సికో ప్రభుత్వానికి 85 లక్షల వ్యాక్సిన్‌ డోసులు పంపుతామని హావిూ ఇచ్చింది. ఈ విషయాన్ని మెక్సికో విదేశాంగ శాఖ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్‌ వెల్లడిరచారు. తమ దేశానికి వ్యాక్సిన్‌ డోసులు పంపుతామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌.. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయేల్‌ లోపెజ్‌ ఓబ్రడార్‌కు చెప్పారట. ‘మెక్సికోకు 85 లక్షల వ్యాక్సిన్‌ డోసులు పంపుతామని స్వయంగా కమలా హ్యారిస్‌.. మా దేశాధ్యక్షుడికి సమాచారం అందించారు‘ అని ఎబ్రార్డ్‌ తెలిపారు. ప్రస్తుతం మెక్సికోలో కరోనా మూడో వేవ్‌ విలయం సృష్టిస్తోంది. డెల్టా వేరియంట్‌ విజృంభించడంతో ఈ దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో అమెరికా నుంచి ఆస్టాజ్రెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లు పంపుతామని కమలా హ్యారిస్‌ చెప్పడంపై మెక్సికో ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.

తాజావార్తలు