మెట్రోపనుల కారణంగా పలు రైళ్లు రద్దు

metro హైదరాబాద్ ” మెట్రో రైల్ పనుల కారణంగా ఈ రోజు పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నగరంలోని భరత్ నగర్, సనత్ నగర్ మధ్య జరుగుతున్న పనుల నేపథ్యంలో మధ్యాహ్నం 12:15 నుంచి 3:15 వరకు ఎంఎంటీఎస్ 18 రైళ్లు, 4 ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.