మెట్రోరైల్‌లో కొలువులు స్థానికులకే ఇవ్వండి
లియోలిస్ ీఎండీతో సీఎం కేసీఆర్
హైదరాబాద్,జూన్4(జనంసాక్షి) : మెట్రో రైలు నిర్వహణ కోసం స్థానికులకే అవకాశం ఇవ్వావని కియోలిస్ కంపెనీ ఎండీని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సీఎం కేసీఆర్ ను కియోలిస్ కంపెనీ ఎండీ అండ్ సీఈవో బెర్నార్డ్ టాబరీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో కలిశారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో సీఎం కేసీఆర్ దూరదృష్టిని బెర్నార్డ్ కొనియాడారు. హైదరాబాద్ మెట్రోరైలు అత్యద్భుతంగా ఉందన్నారు. హైదరాబాద్ మెట్రోరైలు లాంటి డిజైన్ ప్రపంచంలో మరెక్కడా లేదని ప్రశంసించారు.
మెట్రోరైలు ఆపరేటింగ్ లో తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ బెర్నార్డ్ టాబరీకి సూచించారు. స్థానిక ఇంజినీరింగ్ కాలేజీల నుంచి విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవాలని కోరారు. దీంతో, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మెట్రో రైలు అధికారులను బెర్నార్డ్ ఆదేశించారు. కియోలిస్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ, మెట్రో రైళ్లు, తేలికపాటి రైళ్లు, బస్సు సంస్థలను నడుపుతోంది. ఇదే సంస్థ హైదరాబాద్ లో మెట్రోరైలు వ్యవస్థను కూడా నడుపుతుంది.