మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా డయాబెటిక్ శిబిరం*

మెట్ పల్లి పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా ఉచిత డయాబెటిక్ క్యాంపు ఘనంగా నిర్వహించడం జరిగింది. మార్కెట్ రోడ్డు లో ఉదయం 7 గంటల నుండి 8 .30 గంటల వరకు శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్టిక్ 320జి డయాబెటిక్ చైర్మన్ లయన్ డాక్టర్ దిలీప్ రావు,లయన్ ఉష కిరణ్ ఆర్ సి ,లయన్ జెడ్సి సి కోట గంగా జీవన్ , ఆర్సిఎస్ లయన్స్ ధనంజయ్ పాల్గొన్నారు ,
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం రాకేష్ మాట్లాడుతూ దాదాపు ఈ రోజు 150 మందికి పైగా ఉచిత షుగర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్టు అదేవిధంగా ఇ కార్యక్రమం ఈ నెల చివరిగా 30వ తేదీ వరకు 30 రోజులపాటు రోజు వారీగా ఉచిత షుగర్ టెస్ట్ ప్రతి వార్డులలో రోజువారి కార్యక్రమం ఉంటుందని దీనిని పట్టణ ప్రజలు గ్రామీణ ప్రజలు దీనిని ఉదయము 7. గంటల నుంచి 8.30 గంటల లోపు సద్వినియోగం చేసుకోవాలని పట్టణ గ్రామీణ ప్రజలకు విన్నవించారు,ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ కట్కం రాకేశ్ఊ , క్లబ్ సెక్రటరీ లయన్ ఇల్లందుల శ్రీనివాస్, కోశాధికారి లయన్ ఇందూర్ రాకేష్, మహాజన్ నర్సింలు, ప్రోహర్ తుకారాం, చర్లపల్లి రాజేశ్వర్గౌడ్, నాంపల్లి పెద్ద శ్రీనివాస్, గంగుల మురళి, మహాజన్ శివకుమార్ ,మురికి దయాకర్ ,బొమ్మెల శంకర్, ముత్యం రమేష్, మృత్యుంజయ్ బొప్పరాతి లక్ష్మణ్, దొంతుల ఆంజనేయులు ,నర్సింగారావు, చెర్లపల్లి అరుణ్ దీప్ గౌడ్, వెంకటేష్, చిన్న శ్రీనివాస్, డాక్టర్ రమేష్ రెడ్డి ,నరేష్, సత్యనారాయణ ఆల్రౌండర్ గంగాధర్ లయన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజావార్తలు