మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్ లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ప్రజా రక్షణే పోలీసు ప్రధాన లక్ష్యమని మెదక్ పట్టణ సీఐ మధు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణలో భాగంగా ఫ్లాగ్ సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ ఆదేశం మేరకు జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో విద్యార్థిని, విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ సీఐ మధు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆయుధాలను చూపించారు. పోలీసు స్టేషన్ పరిసరాలు, స్టేషన్ అధికారి, రైటర్, వైర్ లెస్ తదితరాలపై అవగాహన కల్పించారు. పోలీసుస్టేషన్లకు దరఖాస్తు రాగానే తీసుకుంటున్న చర్యలు ట్రాఫిక్ నియంత్రణ, షీబృందాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పోలీసులు ప్రజల రక్షణ కోసమే పని చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా సీఐ సూచించారు కార్యక్రమంలో ఎస్ ఐ మల్లారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.