మేజర్‌ గొగోయ్‌ తప్పు చేస్తే శిక్షిస్తాం 

– ఆర్మీ జనరల్‌ రావత్‌
శ్రీనగర్‌, మే25(జ‌నంసాక్షి) : ఒకవేళ ఆర్మీ మేజర్‌ లీతుల్‌ గొగోయి తప్పు చేస్తే, ఆయనకు కూడా కఠిన శిక్ష విధిస్తామని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. భారతీయ ఆర్మీలో ఏ ర్యాంక్‌లో ఉన్న అధికారి తప్పు చేసినా వాళ్లకు శిక్ష తప్పదన్నారు. తమ దృష్టికి వస్తే, దానికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవేళ గొగోయి తప్పు చేసినట్లు తేలితే, ఆయనకు విధించే శిక్ష.. తప్పు చేసేవారందరికీ వర్తిస్తుందన్నారు. కశ్మీరీ వ్యక్తిని జీప్‌కు కట్టివేసి ఊళ్లో తిరిగిన ఘటనలో ఆర్మీ మేజర్‌ గొగోయ్‌ ఫేమస్‌ అయ్యాడు. అయితే అతను రెండు రోజుల క్రితం శ్రీనగర్‌లోని ఓ ¬టల్‌లో అమ్మాయితో కనిపించాడు. ఆ అమ్మాయి మైనర్‌ అని, ఆమెతో ఎందుకు అక్కడ ఉన్నాడన్న అంశం ఇప్పుడు వివాదాస్పదమైంది. తన కూతురు మైనర్‌ అని, ఆమెను ఎవరో వేధిస్తున్నారని ఆ అమ్మాయి తల్లి ఫిర్యాదు చేసింది. నిజానికి ¬టల్‌ రూమ్‌ దగ్గర గొడవ కావడం వల్ల మేజర్‌ గొగోయ్‌ వ్యవహారం బయటపడింది. దీంతో కశ్మీర్‌ పోలీసులు ఈ కేసును సీరియస్‌ తీసుకున్నారు. రాష్టీయ్ర రైఫిల్స్‌లో పనిచేసే మేజర్‌ గొగోయ్‌.. ప్రమాదరకర శ్రీనగర్‌లో ఎలా తిరుగుతున్నాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్మీలోనే పనిచేస్తున్న సవిూర్‌ అనే వ్యక్తితో పాటు ¬టల్‌ గదిలో మేజర్‌ గొగోయ్‌ ఉండడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ఇవాళ ఆర్మీ జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పందించాల్సి వచ్చింది.