మైనార్టీలకు సివిల్ సర్వీస్ కు ఉచిత కోచింగ్

గద్వాల నడిగడ్డ,ఆగస్టు 26 (జనం సాక్షి);
హైదరాబాద్ లో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ నిర్వహించే పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి యం.ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు.2022-23 విద్యా సంవత్సరంలో మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోసం 100 సీట్లుకేటాయించడం జరిగిందని అందులో మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ నుంచి మొదటిసారి ప్రవేశం పొందిన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాలో సాధారణ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని వారి వార్షిక ఆదాయం రూ. 2లక్షలకు మించరాదని ఆగస్టు 22 నుండి వెబైసైట్ http://tmreis.telangana.gov.in దరఖాస్తులు స్వీకరించబడతాయని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 1 నుండి 11 వరకు జోగుళాంబ గద్వాల జిల్లాలో గల తెలంగాణ మైనారిటిస్ గురుకుల పాఠశాల,గద్వాల యందు ఉదయం 10:00 గంటల నుంచి 12:00గంటల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 04023236112 నెంబర్ కు సంప్రదించలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖఅధికారి తెలిపారు.