మొక్కల పెంపకం నిత్యకృత్యం కావాలి
ఆదిలాబాద్,సెప్టెంబర్27 జనంసాక్షి : మొక్కల పెంపకం ఆవశ్యకతలను ప్రతి పాఠశాలలో వివరించాలని ఎమ్మెల్యే జోగురరామన్న అన్నారు. పాఠశాల స్థాయి నుంచే మొక్కల పెంపకం జీవితంలో భాగం కావాల న్నారు. మొక్కలు ఏ విధంగా నాటాలి, వాటికి నీరు ఏ విధంగా పోస్తే చక్కగా పెరుగుతాయో వారికి విశదీకరించాలని అన్నారు. ప్రతి విద్యార్థి మొక్కలు నాటడాన్ని దైనందిన కార్యక్రమంగా అలవర్చుకోవాలని సూచించారు. హరితహారంతో పాటు సిఎం కెసిఆర్ విద్యారంగానికి పెద్దపిట వేస్తున్నారని అన్నారు. కేజీ టూ పీజీ విద్యాలో భాగంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. బంగారు తెలంగాణ సాధనలో హరితహారం, ఉచిత విద్య కూడా భాగమేనని అన్నారు. ఇందుకోసం కేసీఆర్ వెంట నడిచి అనుకున్న లక్ష్యాన్ని చేరాలని అన్నారు.