మొక్కల పెంపకం బాధ్యతగా తీసుకోవాలి: కలెక్టర్‌

ఆదిలాబాద్‌,జూలై2(జ‌నం సాక్షి): పర్యావరణం కాపాడుకుంటూ, వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కుల నాటాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. అలాగే విద్యార్థులు ఈ విషయంలో ముందువరసలో నిలబడాలన్నారు. అడవుల జిల్లాను మళ్లీ పచ్చగా మార్చాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ మేరకు నాలుగోవిడతలో విద్యార్థులు పెద్దగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం ఇస్తున్నాని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కుల నాటి హరితహారంలో పాలుపంచుకోవాలన్నారు. ఇకపోతే వచ్చే గణెళిశ్‌ ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. సంప్రదాయ, సంస్కృతి పరంగా పూర్వీకులు వినియోగించిన మట్టి పాత్రలు, విగ్రహాలు తయారు చేయడంలో నేటి తరానికి శిక్షణ ఇప్పించాలన్నారు. పూర్వం ప్రకృతితో కలిసి మెలిసి పని చేస్తూ, ప్రకృతిలో లభ్యమయ్యే ముడి సరుకుతో అనుకూలంగా వినియోగించుకొని ఆరోగ్యవంతమైన జీవితం గడిపే వారని గుర్తుచేశారు. మట్టి వినాయకుల తయారు చేయడంలో శిక్షణ పొంది, ఆ మెళకువలతో జిల్లా ప్రజలకు సంప్రదాయ విగ్రహాలు అందించడాన్ని అభినందించారు. త్వరలోనే గణెళిశ్‌ ఉత్సవ కమిటీలతో సమావేశాలు నిర్వహించి ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు వినియోగించకుండా అవగాహన కల్పిస్తామని అన్నారు. ఇప్పటి నుంచే చిన్న, పెద్ద మట్టి విగ్రహాలు తయారు చేయాలని సూచించారు. అలాగే కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా మట్టి ప్రమిదలు తయారు చేసి పంపిణీ చేయాలన్నారు. కోల్‌కత్తాలో నేటికీ నదిలో మ ట్టితో ప్రమిదలు చేసి వినియోగిస్తారన్నారు. సమాజంలో ప్లాస్టిక్‌ భూతాన్ని పారదోలేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కుమ్మరి శాలివాహన చేతి వృత్తుల వారికి మట్టిగణపతి విగ్రహాల తయారీ శిక్షణ కార్యక్రమాన్ని ఇటీవల జిల్లా కేంద్రంలో ప్రారంభించారు.శిక్షణకు తోడ్పాటు, ఆర్థిక సహాయం అందిస్తామని కలెక్టర్‌ అన్నారు. శిక్షణ పొందిన వారు యువతరానికి శిక్షణ ఇచ్చి మార్గదర్శకులుగా నిలిచి, ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. నేటితరం వినియోగించేందుకు అవసరమయ్యే పాత్రలు, తాగునీటి బాటిల్‌ వంటి పాత్రలను మట్టితో తయారు చేసేందుకు ఇక్కడి ప్రజలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇందుకు జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని తెలిపారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలను తిలకించారు. వారు తయారు చేస్తున్న పని తీరును అడిగి తెలుసుకున్నారు. విగ్రహాలకు వాడే రంగులను చూశారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఆశన్న మాట్లాడుతూ త్రిపుర రాష్ట్రంలో ఇచ్చిన శిక్షణకు తెలంగాణ నుంచి ఎంతో మంది కుమ్మరి శాలివాహన వారిని పంపించడం జరిగిందన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఏడుగురిని పంపించగా వారిలో నుంచి ఇద్దరు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న శిక్షణకు ఎంపికయ్యారన్నారు. జిల్లాలో 4వేల కుటుంబాల కుమ్మరి, శాలివాహన కులస్తులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

—-

 

తాజావార్తలు