మొక్కవోని సిపిఎం ఉక్కు సంకల్పం
కడప,జూలై7(జనం సాక్షి): కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో సిపిఎం ఉక్కు సంకల్పంతో పోరాటాలను నిర్వ హిస్తోంది. జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడానికి అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నాయని సిపిఎం నేతలు పేర్కొన్నారు. ఇక్కడ ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను గత 12ఏళ్లుగా సిపిఎం ముందుకు తెస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లాలో దశలవారి ఉద్యమాలను సిపిఎం చేపట్టింది. ఉక్కు సంకల్ప యాత్ర పేరుతో జిల్లా వ్యాప్తంగా పాద యాత్రను ఊరూరా నిర్వహించి చైతన్యం చేసింది. రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ చేపట్టిన ఉక్కు దీక్షలకు సిపిఎం సంపూర్ణ మద్ధతును తెలియజేస్తూ ప్రత్యక్ష్యంగా బలపరిచింది. దీనిలో భాగంగా దశల వారీగా ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించింది. సిపిఎం ఆధ్వర్యంలో రాయలసీమ వెనుకబాటు-ఉక్కు పరిశ్రమ ఏర్పాటు- నిరుద్యోగ సమస్య అన్న అంశంపై జిల్లాలో ఏర్పాటు చేసిన సదస్సుకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు ప్రత్యక్షంగా హాజరై జిల్లా ప్రజల్లో చైతన్యం నింపారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతోపాటు, ప్రత్యేక ¬దా సాధన కోరుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరై ఉద్యమానికి దిశా నిర్ధేశం చేశారు. పార్లమెంటులో చర్చజరిగేలా ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. చివరికి ‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు’ అన్న నినాదాన్ని మొదటి సారిగా ముందుకు తేవడంతోపాటు ఆచరణలోఏకంగా మహాసభల్లో తీర్మాణం చేసిన ఘనత సిపిఎంకే దక్కుతుంది. నిత్యం కరువు కాటకాలు, నిరు ద్యోగం, వలసలు వెంటాడి వేధిస్తున్నాయి. జిల్లా అభివృద్ధిని కాంక్షిస్తూ సిపిఎం నికరమైన పోరాటాలను కొనసాగిస్తోంది. ఉక్కు పరిశ్రమ స్థాపన గురించి రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఉక్కు పరిశ్రమ స్థాపన గురించి ఉక్కు సంకల్పంతో సిపిఎం పోరాటాలను నిర్వహిస్తోంది. ఈ మేరకు దశలవారీగా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతోంది.