*మోక్ష ప్రదాత*
శంభో హర హర శంభో శివ శివ
అంబ మనోహర ఆదిపరాత్పర
శరణముశంకర లోక భయంకర
ఆశ్రిత జనాళి మనో శుభంకర !
భవ భయ హరణా బసవ తురంగ
భస్మోద్ధూళిత బసిత శుభంగా
వికటాట్టహాసం విషఫణి భూషా
విరూపాక్ష విశ్వేశ మహేశా !!
పాహి పరమాత్మ జ్ఞాన విధాత
మృత్యుంజయ శివ మోక్ష ప్రదాత
*” రసస్రవంతి ” & ” కావ్యసుధ “*
9247313488, హైదరాబాదు