మోడీ డైలాగుల మనిషి
– కేంద్రం ఏకపక్షనిర్ణయాలతో రైతులకు న్యాయం జరగదు
– చంద్రబాబును విమర్శించడమే వైసీపీ, జనసేనల లక్ష్యం
– ప్రతిపక్షాలు తీరుమార్చుకోకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారు
– ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
అమరావతి, జులై6(జనం సాక్షి) : ప్రధాని నరేంద్ర మోడీ కేవలం డైలాగుల మనిషేనని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ డైలాగులకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. ఇవేవీ వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ కళ్లకు కనబడడం లేదా..? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక ¬దా ఇవ్వలేమని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ ఇస్తే నిలదీయాల్సింది సీఎం చంద్రబాబునా అని ప్రశ్నించారు. ప్రత్యేక ¬దాలో ఇవ్వకపోగా అన్ని ఇంచ్చామని కేంద్రం చెప్పడం చూస్తుంటే ఏపీ పట్ల కనీస బాధ్యత కేంద్రానికి లేనట్లుగా కనిపిస్తుందన్నారు. కేంద్రం తీరు ఏపీ ప్రజలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. ఏపీ ప్రజలకు అండగా ఉంటామని చెప్పుకొనే పవన్, జగన్‌లు మోదీని ప్రశ్నించక పోవటం సిగ్గుచేటన్నారు. కేవలం చంద్రబాబును తిట్టడానికే వీరు ప్రజల్లోకి వెళ్తున్నారని, బీజేపీ, జనసేన, వైసీపీల ఏకైక అజెండా ఇదేగా ఉందని మండిపడ్డారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కంటే మెరుగైన చర్యలు ఏపీలో తీసుకుంటున్నామని స్పష్టం చేసిన సోమిరెడ్డి… దేశవ్యాప్తంగా రైతులు బీజేపీకి గుణపాఠం చెబుతారన్నారు. రైతులు పెట్టిన పెట్టుబడిపై 50శాతం ఆదాయం వచ్చేలా మద్దతు ధర ఇస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను పక్కన పెట్టి కనీస మద్దతు ధరపై రాష్ట్రాల ప్రతిపాధనలు పట్టించుకోకుండా కేంద్రం నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. కూలీ ఖర్చులను, పెట్టుబడిపై వడ్డీని పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధర నిర్ణయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏసీపీ సిఫార్సులను పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపించిన సోమిరెడ్డి… కనీస మద్దతు ధరపై నిర్ణయం చేసిన పంటలను కూడా కేంద్రం పూర్తిగా కొనడం లేదన్నారు. గత నాలుగేళ్లలో పంటల కొనుగోళ్ల కోసం ఏపీ రూ. 2662 కోట్లు ఖర్చు పెడితే… కేంద్రం కేవలం రూ. 1180 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. పంటల ఉత్పత్తి వ్యయాన్ని కూడా కేంద్రం చాలా తక్కువగా లెక్కించిందని సోమిరెడ్డి ఆరోపించారు. జొన్న, మొక్క జొన్న పంటలకు కనీస మద్దతు ధర ఉన్నా కేంద్రం కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైన కేంద్రం ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సులను, రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని మద్దతు ధరలను మరింత పెంచాలని సోమిరెడ్డి కోరారు.