మోడీ పీఎం అయ్యేవారే కాదు..!

చత్తీస్ ఘడ్ పోలీసులు షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. 2014 జనరల్ ఎలక్షన్స్ టైమ్ లో… అప్పటి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి,  ఇప్పటి పీఎం నరేంద్రమోడి హత్యకు కుట్ర జరిగినట్లు వివరించారు.  రాయ్ పూర్ పోలీసుల అదుపులోని  సిమి టెర్రరిస్ట్ గుర్ఫాన్ కన్ఫెషన్ స్టేట్ మెంట్లో  ఈ  విషయం బయటపడింది. అంబికాపూర్ లోక్ సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీని మర్డర్ చేసేందుకు స్కెచ్ వేశామని … అయితే కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదని గుర్ఫాన్ చెప్పినట్లు తెలుస్తోంది.

మోడీ పీఎం అయ్యేవారే కాదు..!

జార్ఖండ్ పేలుళ్ల  తర్వాత రాయ్ పూర్ నుంచి పరారైన గుర్ఫాన్ అరేబియా సముద్ర తీరంలో తలదాచుకున్నాడు. కొంతకాలం అక్కడ కేర్ టేకర్ గానూ పనిచేశాడు. అతను దుబాయ్ లో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అబూ సలేంను కలిశాడు. ఈ మీటింగ్ లోనే… మరికొందరు టెర్రరిస్టులనూ కలిశాడని… రాయ్ పూర్ ఐజీ వివరించారు.  నేపాల్ లో సిమీ ఏర్పాటు చేసిన న్యూఇయర్ పార్టీకి అటెండ్ అయినట్టు తెలిపారు. సిమీకి చెందిన లీడర్లంతా… ఈ పార్టీకి వచ్చినా… భారత నిఘా వర్గాలు కనుక్కోలేకపోయాయని గుర్ఫాన్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం.

తన సహచరులు ఇజాజుద్దీన్, అస్లాంలను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన తర్వాత… గుర్ఫాన్ తనంతట తానుగానే… రాయ్ పూర్ కోర్టులో లొంగిపోయాడు. విచారణకు సహకరిస్తున్నా… ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలేదని పోలీసులు చెబుతున్నారు. జార్ఖండ్ పేలుళ్లకు కారణమెవరనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

గుర్ఫాన్ కన్షెషన్ స్టేట్ మెంట్స్ ప్రకారం.. తీవ్రవాద కదలికలను కనిపెట్టడంలో నిఘా వర్గాలు కంప్లీట్ గా ఫెయిలైనట్టు తెలుస్తోంది.