మోడీ రాకను వ్యతిరేకిస్తూ ఐ.ఎఫ్.టి.యు నిరసన

టేకులపల్లి, నవంబర్ 12( జనం సాక్షి): భారత ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్.ఎఫ్.సి.ఎల్ ప్రారంభోత్సవానికి రావడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగానిరసనలు తెలపాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా టేకులపల్లి హైటెక్ కాలనీలో సింగరేణి కార్మికులతో,9వ మైలు తండాలో హమాళి కార్మికులతో నల్ల బ్యానర్తో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి మాట్లాడుతూ రామగుండం ఆర్.ఎఫ్.సి.ఎల్ ఎరువుల ఫ్యాక్టరీ గతంలోనే ప్రారంభం అయినప్పటికీ మళ్ళీ ప్రారంభోత్సవం పేరుతో రావడం వెనుక ప్రజలను మోసం చేసే కుట్ర దాగి ఉందని అన్నారు. ప్రభుత్వ రంగసంస్థలన్నీటిని ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులైన 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలు రాస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ శక్తుల, పెట్టుబడిదారుల ప్రయోజనాలు నెరవేర్చేందుకే మోడీ రామగుండం పర్యటనకు వస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక,కర్షక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. ఐఎఫ్టియు టేకులపల్లి ఏరియా కమిటీ కార్యదర్శి రాయండ్ల కోటిలింగం అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రెంటాల ప్రవీణ్, జి.నాగమణి, సిహెచ్.శివయ్య, జె.బొజ్జ, బి.కౌసల్య, సిహెచ్.ఎర్రమ్మ, బి.మౌనిక, పి.సోమయ్య, జి.రవికుమార్, బి.శారద,భూక్య నాగేశ్వర్ రావు, గుగులోత్ సూర్య నాయక్, భూక్య హరిలాల్, భూక్య లచిరామ్, దారవత్ నరేష్, దారవత్ అనిల్, బాణోత్ చిన్న,తేజావత్ అజయ్,గుగులోత్ వంశీ,బాణోత్ రాజు, భూక్య శేషు, తదితరులు పాల్గొన్నారు.