మోత్కుర్ కట్ట మైసమ్మ దేవాలయంలో చోరి
దోమ ఆగష్టు 30(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామ సమిపంలొ గల కట్ట మైసమ్మ దేవాలయంలో చోరి జరిగింది.దోమ SI విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దేవాలయ గేటు తాళం బద్దలు కొట్టి అమ్మ వారి హుండిని దోంగిలించడం జరిగింది. దాదాపు 70,000/- వరకు నగదు ఉండేదని దేవాలయ పూజారి కరణం శ్రీ కాంత్ వాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వివరించారు.
