మోదీపై అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తా: అన్నా హజారే

 

2

హైదరాబాద్‌: జనంసాక్షి: జన్‌లోక్‌పాల్‌ బిల్లు కోసంఅలుపెరుగని పోరాటం చేసి  అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడిగా పేరొందిన అన్నా హజారే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీపై ఉద్యమిస్తానంటున్నారు. ప్రధాని మోదీ అవినీతిపై పోరాడతానన్న హామీని మర్చిపోయారని అది గుర్తు చేసేందుకే భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఉద్యమిస్తానని అన్నా హజారే పేర్కొన్నారు. గత ఎనిమిది నెలల్లో అవినీతిపై పోరాటం విషయంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవచూపలేదని ఆయన ఆరోపించారు. లోక్‌పాల్‌ విషయంలోనూ ఎలాంటి ప్రగతీ చోటుచేసుకోలేదన్నారు. ఉద్యమం కోసం కార్యకర్తలను సమీకరించుకుంటున్నట్లు హజారే తెలిపారు.