మోదీ షాహెన్‌షా కాదు
– మా కుటుంబంపై నిరాధార ఆరోపణలు
– సోనియా
యూపీ,మే31(జనంసాక్షి):నరేంద్ర మోదీ ఈ దేశానికి ప్రధాన మంత్రి అని, షాహెన్ షా కాదని కాంగ్రెస్ సోనియా గాంధీ మండిపడ్డారు. బీజేపీ నేతలు పదేపదే వల్లిస్తోన్న ముఖ్త భారత్ అర్థం ఏంటని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్‌ను బద్నాం చేయడంలో భాగమేనని పేర్కొన్నారు. పొద్దున లేస్తేనే కాంగ్రెస్ నేతలపై విరుచుకు పడటం బీజేపీ నేతలకు పరిపాటి అయిందని విమర్శించారు. తన కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ సర్కారుకు దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలని సవాలు విసిరారు. ఆరోపణలుంటే సర్కారు ఎందుకు విచారణ జరిపిండచంలేదని నిలదీశారు. తన అల్లుడు రాబర్ట్ వాద్రాపై వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించగా అదంతా బీజేపీ నేతల కుట్ర అని తోసి పుచ్చారు.ఎన్డీఏ రెండేళ్లపాలనపై ఆమె మండిపడ్డారు. మోదీ లాంటి పాలనను తాను గతంలో ఎన్నడూ చేడలేదని తెలిపారు. దేశంలో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయని, పేదరికంతో ప్రజలు అలమటిస్తున్నారని తెలిపారు. రైతులు బాధలతో అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో మోదీ ఉత్సవాలు నిర్వహించడం తనకు అర్థం కావడంలేదన్నారు.