మోదీ సర్టిఫికెట్లు నకిలీవే

4

– సరిపోవడం లేదు

– కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ,మే9(జనంసాక్షి):బీజేపీ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడి డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవని ఆమ్‌ ఆద్మీ పార్టీ వాదిస్తోంది. రెండు సర్టిఫికెట్లలో మోడీ పేరు వేర్వేరుగా ఉందని, అంతేకాకుండా సంవత్సరాలు కూడా తేడాగా ఉన్నట్లు ఆప్‌ ఆరోపిస్తోంది. డిగ్రీ సర్టిఫికెట్‌ లో నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోడీ అని ఉంటే, మార్క్స్‌ షీట్‌ లో నరేంద్ర కుమార్‌ దామోదర్‌ దాస్‌ మోడీ అని ఉందన్నారు ఆప్‌ నేత అశుతోష్‌. పాసైన సంవత్సరం కూడా ఒకదానితో ఒకటి పోలిక లేకుండా ఉన్నాయన్నారు. ఇవి ఫోర్జరీ సర్టిఫికెట్లని, ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు అమిత్‌ షా, అరుణ్‌ జైట్లీలు క్షమాపణ చెప్పాలన్నారు.ఢిల్లీ యూనివర్సిటీలో ప్రధాని మోడీకి సంబంధించిన డిగ్రీ డాక్యుమెంట్లు సీల్‌ చేసి ఉన్నాయన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. అలాంటప్పుడు దానికి సంబంధించిన కాపీలు బీజేపీ నేతల దగ్గరికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు.ప్రధాని విద్యార్హతలు తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉందని, వాటిని వెల్లడించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆర్టీఐ కి దరఖాస్తు చేశారు. ఐతే, ఆర్టీఐ వాటిని వెల్లడించేందుకు నిరాకరించింది. అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఇవాళ విూడియా సమావేశం పెట్టి వాటిని వెల్లడించారు. ప్రధాని డిగ్రీ, ఎంఎ సర్టిఫికెట్లను విూడియాకు చూపించారు.