మోదీ సూటుకు భలే గిరాకీ
న్యూఢిల్లీ,ఫిబ్రవరి18(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ధరించిన రూ. 10 లక్షల విలువైన సూట్‌ను సురేష్ అగర్వాల్ అనే వ్యాపారవేత్త రూ. కోటికి వేలంలో దక్కించుకున్నాడు. వేలంలో ప్రస్తుతం సూట్ ధర రూ. 1.21 కోట్ల వద్ద నిలిచి ఉంది. రాజకీయపరంగా తీవ్ర వివాదం రేపిన ఈ సూట్‌తో పాటు ప్రధాని అయ్యాక మోదీకి గడిచిన తొమ్మిది నెలలుగా కానుకలుగా అందిన 455 వస్తువులను సూరత్‌లో వేలం వేస్తున్నారు. వేలం మూడు రోజులపాటు కొనసాగనుంది. గంగా ప్రక్షాళన కోసం చేపట్టిన క్లీన్ ఇండియా మిషన్ ప్రాజెక్టుకు నిధుల సవిూకరణ కోసం ఈ వేలాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీకే కాదు, ఆయన వేసుకున్న దుస్తులకు కూడా క్రేజ్ ఎక్కువగానే ఉంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ జనవరి 25న వేసుకున్న సూట్‌ను గుజరాత్‌లోని సూరత్‌లో బుధవారం నుంచి వేలం వేయనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేలంలో మొదటిరోజు ప్రారంభ ధర రూ.51లక్షలుగా నిర్వాహకులు ప్రకటించారు. సూట్‌తోపాటు మోదీ ఉపయోగించిన 450 రకాల వస్తువులు, బహుమతులను కూడా వేలం వేయనున్నట్లు తెలిపారు. దీనికి ఏర్పాట్లు చేశారు.