మోరాయించిన మొదటి యూనిట్‌

జయవాడ, జూలై 31 : విటిపిఎస్‌ మొదటి యూనిట్‌లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా 210 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బ్రాయిలర్‌ కేబుళ్లు పగిలిపోవడంతో ఆ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పాదన నిలిచిపోయింది. వెంటనే సాంకేతిక నిపుణులను రప్పిస్తున్నామని, 24 గంటల్లో యూనిట్‌ను పునరుద్దరిస్తామని ప్లాంట్‌ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా వార్షిక నిర్వహణ నిమిత్తం మూసివేసిన ఆరవ యూనిట్‌ను బుధవారం నుండి పునః ప్రారంభిస్తున్నామని, రోజుకు 210 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రాగలదని ప్లాంట్‌ అధికారులు తెలిపారు.

తాజావార్తలు