మోసానికి మారుపేరు కెసిఆర్: దొమ్మాటి
జనగామ,అక్టోబర్30(జనంసాక్షి): మోసానికి మారు పేరు కేసీఆర్ అని టీపీసీసీ కార్యదర్శి.దొమ్మాటి సాంబయ్య అన్నారు. మంగళవారం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలంలోని రాంపూర్, మాలకపల్లి, ధర్మపురం, నర్శింగపల్లి, ఎలకుర్తి, రేపాక, ఉనికిచర్ల గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ 1200మంది అమరుల పునాదులపై ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అబద్ధపు హావిూలతో వంచించారని అన్నారు. హావిూలతో గ్దదెనెక్కిన తరువాత హావిూల అమలు మరిచి నియంతలా రాష్ట్రాన్ని పాలించి,రాష్టని 80 వేల కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కత్తుల కట్టయ్య, బాలరాజు గౌడ్,జమాల్, మల్లయ్య, ఆనందం తదితరులు పాల్గొన్నారు.