యరగండ్ల పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంచాల మండల తెరాస నాయకులు
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసా క్షి):;- మునగోడు నియోజకవర్గ పరిధిలోని యరగండ్ల పల్లి గ్రామంలో ఐదు వార్డుల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన మంచల మండల టిఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం 18 వేల కోట్లు కాంట్రాక్టు కోసం మునుగోడు ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే స్వార్థ రాజకీయాల కోసం రాజీనామా చేసి వచ్చిన ఎన్నిక తన స్వార్థం కోసం వచ్చిన ఎన్నికని అన్నారు. మునుగోడు ఉపఎన్నిక దేశమంతా ఆసక్తిగా గమనిస్తుందన్నారు. బిజెపి, రాజగోపాల్ రెడ్డి కుట్రలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ తొలి ఉద్యమ దశ, మలిదశ ఉద్యమ లో బిజెపి పాత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ కారణమని, అందుకే బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అరం గ్రేటం చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలచిపోయయాన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎర్పల చంద్రయ్య, నర్సింగ్ వేంకటేష్ గౌడ్, మండల యువజన విభాగం అధ్యక్షుడు వనపర్తి భద్రినాద్ గుప్తా మేగలి వేంకటేష్, పుజారి బిక్షపతి, గంట విజయ్, కసరమోని మహేందర్ యాదవ్, కరుణాకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు