యాదగిరిపై మరో ఫిర్యాదు
హైదరాబాద్ : గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ యాదగిరిరావుపై మరో ఫిర్యాదు నమోదుయింది. తనను యాదగిరిరావు లైంగికంగా వేధించారని నవీన్ కుమార్ అనే జూనియర్ అర్టిస్ట్ నాచారం పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశాడు. గతంలో యాదగిరి భయపెట్టినందువల్లనే పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయినట్టు నవీన్ వెల్లడించాడు.