యాదాద్రిలో గర్భగుడి దర్శనాలు నిలిపివేత
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సంకల్పించిన మహోన్నత అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. ఆలయాన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఇవాళ్టి నుంచి స్వామి వారి గర్భగుడి దర్శనాలు నిలిపివేశారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాతే లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా నిర్మించిన బాలాలయంలోనే భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించనున్నారు. బాలాలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చినజీయర్ స్వామి ప్రారంభించారు. అటు మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.