యాదాద్రీశుడిని దర్శించుకున్న హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి

యాదాద్రి జనం సాక్షి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి (Justice  దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న జస్టిస్‌ అనుమపమ చక్రవర్తి.. యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వాదం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు జస్టిస్‌ అనుపమ చక్రవర్తి దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.