యానిమేషన్ రంగానికి రాజధానిగా హైదరాబాద్: పొన్నాల
హైదరాబాద్: యూనిమేషన్, గేమింగ్ రంగానికి హైదరాబాద్‌ను రాజధానిగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలియజేశారు. ఈ నెల 5వ తేదీనుంచి వరకు లండన్‌తో పాటు వివిధ నగరాల్లో పర్యటించి ఇందుకనుగుణంగా అధ్యయనాలు చేశామని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాలతో నోల్చిచే మనం తక్కువ ఖర్చుతోనే యానిమేషన్ రంగాన్ని ప్రోత్సహించే అవకాశాలున్నందున ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. తాము తీసుకునే నిర్ణయాల వల్ల ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.