యాపట్ల గ్రామాన్ని మండల కేంద్రం చేయాలి.

ఉపసర్పంచ్ పబ్బతి అజయ్ కుమార్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై 27(జనంసాక్షి):
పెద్దకొత్తపల్లి మండలం కేంద్రానికి 12కిలో మీటర్లు దూరంగా ఉన్న యాపట్ల గ్రామాన్ని మండల కేంద్రం గా మార్చాలని ఆ గ్రామం ఉపసర్పంచ్ పబ్బతి అజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.యాపట్లను మండలం కేంద్రంగా చేయటం వలన యాపట్ల గ్రామానికి చుట్టూ పక్కన ఉన్న కొత్తగా ఏర్పాటు అయిన గ్రామ పంచాయతీ లు,కొత్త యాపట్ల , చంద్రబండ తండా, అలాగే, వేడుక రావు పల్లి తండా , మారేడు మాన్ దీన్నే,చిన్నకొత్తపల్లి, జగన్నాథపురం, దేదినేనిపల్లి,దేనేపల్లి తండా,రాయవరం ఈవిధంగా సుమారు 10గ్రామాల ప్రజలకు అందుబాటులో, అనుకూలంగా ఉంటుందని అన్నారు.అలాగే రవాణా సౌకర్యాలు కూడా యాపట్ల నుంచి కొల్లాపూర్, మరియు అచంపేట్, నాగర్ కర్నూల్, వనపర్తి , తదితర పట్టణాలకు అనుకూలం గా ఉన్నాయని గుర్తు చేశారు.యాపట్ల గ్రామాన్ని మండల కేంద్రంగా చేయడంలో అధికారులు సర్వే చేసి ప్రజా అభిష్టం మేరకే నిర్ణయం తీకోవాలని,దీనికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.