‘యాపిల్’ చూపు ‘కార్పొరేట్ల’ వైపు…

3ఐఫోన్, ఐప్యాడ్, మాక్‌బుక్ వంటి ఉత్పత్తుల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల మనస్సులను చూరగొన్న యాపిల్ సంస్థ ఇప్పుడు భారత కార్పొరేట్లపై కన్నేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న భారత్‌లో ఇప్పుడు యాపిల్ ఉత్పత్తును వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి కార్పొరేట్ల వద్దకు తమ ఉత్పత్తులను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఆ సంస్థ నడుం బిగించింది.

దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 130కి పైగా కార్పొరేట్ రీసెల్లర్స్‌ను యాపిల్ నియమించింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా తనకు వచ్చే లాభాల్లో 15 నుంచి 20 శాతం వాటాను భారత్ నుంచి పొందవచ్చని ఆశిస్తోంది. ఆగ్రా, ఐజ్వాల్, భోపాల్, కోజికోడ్, జంషెడ్‌పూర్, మధుర, వారణాసి వంటి టైర్-2, టైర్-3 నగరాల్లోనూ తమ స్టోర్స్‌ను ప్రారంభించేందుకు వ్యూహాలు పన్నుతోంది. దీని వల్ల మార్చి 2016 వరకు ఆశించిన స్థాయిలో లక్ష్యాన్ని సాధించవచ్చని యాపిల్ భావిస్తోంది.