యాషెస్‌తో వార్న్ రీ ఎంట్రీ..? దిగ్గజ స్పిన్నర్‌పై ఇంగ్లిషు మీడియాలో చర్చ
సిడ్నీ, డిసెంబర్ 5: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌గా వెలుగొందిన ఆస్టేల్రియా దిగ్గజం షేన్ వార్న్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా… వచ్చే ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్‌తో వార్న్ మళ్లీ బరిలోకి దిగబోతున్నాడా… ప్రస్తుతం బ్రిటీష్ విూడి యాలో ఇదే చర్చ జరుగుతోంది. ఆసీస్ జట్టు మరిం త బలం చేకూర్చే ఉధ్దేశంతో చాలా మంది అభిమా నులు వార్న్ రీ ఎంట్రీ కోరుతున్నారు. తాజా గా పాంటింగ్ రిటైర్మెంట్‌తో ఈ డిమాండ్ మళ్ళీ ఊపం దుకుంది. అయితే తాను మళ్ళీ టెస్ట్ క్రికెట్ లోకి ఆడడంపై సానుకూలంగానే స్పందించిన వార్న్ ఖచ్చితంగా చెప్పలేనన్నాడు. 43 ఏళ్ళ ఈ స్పిన్ దిగ్గజం 2007లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 15 ఏళ్ళ కెరీర్‌లో 145 టెస్టులాడి 708 వికెట్లు పడగొ ట్టాడు. దీనిలో 195 యాషెస్ వికెట్లు ఉండడం విశే షం.అలాగే 194 వన్డేల్లో 293 వికెట్లు తీసు కున్నాడు. సంతోషంగానే రిటైర్మెంట్ ప్రకటించానని, జట్టుకు అవసరమైతే మళ్ళీ పునరాగమనం చేసేందకు అభ్యంతరం లేదని వార్న్ చెప్పాడు. ప్రస్తుతం వార్న్ ఆస్టేల్రియా దేశవాళీ క్రికెట్ లీగ్ బిబిఎల్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరపున ఆడుతున్నాడు. అయితే జట్టులోకి పునరాగమనం చేసే ఉధ్దేశంపై మాత్రం వార్న్ స్పష్టమైన అభిప్రాయానికి రాలేకపోయాడు. తన అవసరం జట్టుకు లేదనే భావిస్తున్నట్టు తెలిపాడు. టీ ట్వంటీలలో కేవలం 24 బంతులే వేస్తానని, ప్రస్తుతం తన ఫిట్‌నెస్ టెస్టు లకు అందుబాటులో ఉంటుందనేది డౌటేనని వార్న్ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే ప్రముఖ సిడ్నీ పత్రిక డైయిలీ టెలిగ్రాఫ్ ఇవాళ నిర్వహించిన ఒపినీయన్ పోల్‌లో 70 శాతానికి పైగా అభిమానులు ఆసీస్ కెప్టెన్ క్లార్క్ వ్నాం రీఎంట్రీ కోసం అడగాలని అభిప్రాయపడ్డారు.