యాసిన్ మాలిక్ అరెస్టు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ఛైర్మన్ మహ్మద్ యాసిన్ మాలిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1987 ఎన్నికలకు సంబంధించిన కేసులో వారం రోజులు పోలీస్ కస్టడీలో ఉన్న ఆయన బెయిల్‌పై శనివారం విడుదలయ్యారు. ఈ నెల 15న హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సయ్యద్ ఆలీ షా గిలానీ నివాసంలో నిర్వహించే వేర్పాటువాదుల సమావేశానికి జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కశ్మీర్ పండిట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులకు కాలనీల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వేర్పాటువాద సంఘాలు ఏకమై దీనిపై పోరాడాలని నిర్ణయించాయి. ఈ కీలక భేటీలో యాసిన్ మాలిక్ పాల్గోనే అవకాశం ఉండటంతో పోలీసులు ఆయనను తిరిగి తమ అదుపులోకి తీసుకున్నారు.