యుఎస్ ఓపెన్ షెడ్యూల్‌లో మార్పు పురుషుల ఫైనల్ ఒకరోజు వాయిదా
న్యూయార్క్,డిసెంబర్ 15: వచ్చే ఏడాది జరగనున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసు కున్నాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్‌ను సోమ వారం నిర్వహించనున్నారు. ఎప్పుడూ శనివారం మహిళల ఫైనల్, ఆదివారం పురుషుల ఫైనల్ జరుగుతుండగా తమకు విశ్రాంతి లేకపోవడం ఇబ్బందిగా ఉందని పలువురు టాప్ ప్లేయర్స్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. ఏడాదిలో జరిగే నాలుగు గ్రాండ్‌శ్లామ్స్‌లో కేవలం యుఎస్ ఓపెన్‌లో మాత్రమే సెవిూస్, ఫైనల్స్ వరుస రోజుల్లో ఉంటున్నాయని ఆటగాళ్లు చెప్పడంతో దీనిపై నిర్వాహకులు ఆలోచనలో పడ్డారు. కమిటీలో పూర్తిగా చర్చించి ఆదివారా నికి బదులు సోమవారం నిర్వహిం చాలని నిర్ణయించారు. దీని తో పాటు వర్షాకాలం కూడా ఈ మార్పుకు పరో క్షంగా కారణమైంది. గత ఐదేళ్ళుగా పురుషుల సింగిల్స్ ఫైనల్ వర్షం కారణంగా మరుసటి రోజు కు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నేరుగా సోమవారమే తుది పోరు నిర్వహిస్తే.. ఆటగాళకు కూడా విశ్రాంతి దొరికుతుందని భావించి మార్పు చేశారు. మిగిలిన మూడు గ్రాండ్‌శ్లామ్స్‌లో మహిళల, పురుషుల సెవిూస్ కూ, ఫైనల్స్ మధ్య ఒకరోజు విరామం ఉంటుం ది. ఇదిలా ఉంటే షెడ్యూల్‌తో పాటు ప్రైజ్‌మనీలోనూ మార్పు జరిగింది. వచ్చే ఏడాది నుండి టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీని రికార్డు స్థాయిలో 29.5 మిలియన్లకు పెంచేశారు. యుఎస్ ఓపెన్ చరిత్రలోనే ఇది అత్యధిక మొత్తం . ప్రస్తుతం 4 మిలియన్లు ప్రైజ్‌మనీగా ఇస్తున్నారు. అయితే ప్రైజ్‌మనీ పంపకాలపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా షెడ్యూల్ మార్పు, ప్రైజ్ మనీని పెంచడంపై ఆండీముర్రే, సెరెనా విలియ మ్స్‌తో పాటు పలువురు టాప్ ప్లేయర్స్ ఆనం దం వ్యక్తం చేశారు.