యువతతో క్రికెట్ ఆడిన ఎన్నారై నరసింహారెడ్డి..
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొన్న ఎన్నారై…
– అంజనాపురం యువసేన కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్ ఆర్ ఐ…
బూర్గంపహాడ్ అక్టోబర్ 02 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ నరసింహారెడ్డి చిన్నప్పటినుండి క్రికెట్ పై మక్కువతో చదువుతూనే క్రికెట్ ఆడేవారు. ఈ క్రమంలో ఉన్నత చదువులు చదువుకొని అమెరికా వెళ్లి, ఇటీవల తన కుటుంబమును కలిసేందుకు స్వగ్రామం వచ్చారు. ఈ నేపద్యంలో అంజనాపురం గ్రామ శివారు నందు ఉన్నటువంటి శీతల మైదానం క్రీడా మైదానంలో తన స్నేహితుడు తేజావత్ గాంధీ తో కలిసి ఆదివారం అంజనాపురం యువ సైన్యంతో క్రికెట్ ఆడి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాసేపు క్రీడ మైదానం మొత్తం కలియ తిరుగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆనందానికి కారణమైన గాంధీని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. స్థానిక యువతకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ క్రీడలు మానసి కోలాసానికి దోహదపడతాయని చదువుతోపాటు క్రీడలు పై ఆసక్తి ఉన్నవారు క్రమశిక్షణను కలిగి ఉంటారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్న సహాయం చేసేందుకు ముందు ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భూక్య రాంబాబు, భూక్య రామారావు యాదవ్ జాటోత్ ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్, చిట్టి స్థానిక యువత పాల్గొన్నారు.