యువతరం మానవ హక్కులతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి

 

జాతీయ మానవ హక్కుల మండలి రాష్ట్ర అధ్యక్షులు అయిల్నేని శ్రీనివాస రావు

జగిత్యాల, జనంసాక్షి సారంగపూర్ సెప్టెంబర్ 19

నేటి సమాజంలో యువతరం మానవ హక్కులతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి అని
జాతీయ మానవ హక్కుల మండలి రాష్ట్ర అధ్యక్షులు అయిల్నేని శ్రీనివాస రావు అన్నారు.ఆదివారం
జిల్లాలోని సారంగాపూర్ మండలం రెచపల్లి గ్రామంలో జాతీయ మానవ హక్కుల మండలి తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో , మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల అవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. రెచపల్లి గ్రామ శివాజీ (శివసేన ) యువత కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు చేయగా..కరీంనగర్ పట్టణంకు చెందిన మెడికవర్ హాస్పిటల్ వైద్యులు వైద్య సేవలు అందించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆరోగ్యం- పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సామాజిక అంశాలపై సూచనలు చేశారు అనంతరం జాతీయ మానవ హక్కుల మండలి రాష్ట్ర అధ్యక్షులు అల్నేని శ్రీనివాస రావు మాట్లాడుతూ యువకులు మన పరిసర ప్రాంతాలలో సమస్యలను గుర్తించి వాటిని . పరిష్కరించుటకు మా ఎన్ హెచ్ అర్ సి కి సమాచారం అందిస్తే మేము సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాం అని తెలిపారు. ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు,శివసేన యువజన సంఘం సభ్యులను , మెడికవర్ హాస్పిటల్ వైద్య సిబ్బందిని సన్మానించారు…ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల గ్రామ ప్రజలు సామాజిక కార్యక్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో, జాతీయ మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాస మహేష్, సంయుక్త కార్యదర్శి మ్యాడo జలంధర్. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పెరమండ్ల శివ కృష్ణ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం. కార్యదర్శి బొజ్జ ప్రకాష్, ఉపాధ్యక్షుడు కొండ్రా బీమేష్. సహాయ కార్యదర్శి పల్లికోండ అనిల్. హరీష్ మరియు శివాజీ (శివసేన) యూత్ సభ్యులు. మేడికవర్ హాస్పిటల్ సిబ్బంది, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.