యువతుల జీవితాల్లో కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్‌ వెలుగులు-పద్మారావు

వరంగల్‌,ఆగస్టు28  : రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్‌ పథకాలు పేద యువతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని రాష్ట్ర మంత్రి పద్మారావు అన్నారు. కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్‌ పథకాలకు నేరుగా తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఇంటికే చెక్కు వస్తుందని ఆయన తెలిపారు. సోమవారం సికింద్రాబాద్‌ నియోజకవర్గం సీతాఫల్‌ మండి ప్రాంతంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 25 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కులను 41 మందికి మంత్రి పద్మారావు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్రోకర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఎవరికీ ఒక్క రూపాయి ఇచ్చేది లేదన్నారు. ఏవైనా అవినీతికి పాల్పడితే తమ దృష్టికి తీసుకరావాలని మంత్రి సూచించారు సీఎం కేసీఆర్‌ పేద ప్రజల పక్షపాతి నిరంతరంగా వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ కుమారి, ధనంజన గౌడ్‌, ఆలకుంట సరస్వతి, సామల హేమ, భార్గవి, ఎమ్మార్వో లు సుగుణ, శైలజ తదితరులు పాల్గొన్నారు..