యూఏఈకి కేటీఆర్‌కు ఆహ్వానం

4

యూఏఈ వార్షిక పెట్టుబడుల సదస్సుకి మంత్రి కె.తారక రామారావు

140 దేశాలప్రతినిదులు హజరయ్యే సమావేశం

ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రాంతాలపై చర్చ

ఈ సమావేశంలో ప్రపంచానికి తెలంగాణలోని అవకాశాలను పరిచయం చేయవచ్చన్న మంత్రి

హైదరాబాద్‌, ఫిబ్రవరి22(జనంసాక్షి) : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నిర్వహించే ఐదో వార్షిక పెట్టుబడుల సదస్సుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అహ్వనం అందింది. ఈ మేరకు దుబాయి పాలకుడు, యూఏఈ వైస్‌ ప్రెసిడెండ్‌ అయిన మహ్మమద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మకోటమ్‌  ఐటిశాఖ  మంత్రి కె.తారక రామారావుని అహ్వనం పంపారు. మార్చ్‌ 30 నుంచి 1ఏప్రిల్‌ వరకి దుబాయిలోని దుబాయి కన్వేన్షనల్‌ సెంటర్‌ జరిగే ఈ వార్షిక పెట్టుబడుల సదస్సులో పాల్గొనాల్సిందిగా యూఏఈ  రాయబార కార్యాలయం మంత్రిని సంప్రదించింది. ఐదోవిడత జరుగుతున్న వార్షిక పెట్టుబడుల సదస్సులో వీదేశీ పెట్టుబడుల ద్వారా సస్టేయినబుల్‌ డెవలప్‌మెంట్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌) అనే అంశంపై విస్తృతమైన చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, వ్యాపార నిపుణులు, కంపెనీలు పాల్గొంటాయి. ప్రపంచంలోని అతిపెద్దం కంపెనీలు, పెట్టుబడిదారులు కలిసి ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాల్లో వీదేశీ పెట్టుబడులు పెట్టవచ్చో చర్చిస్తారని, ఇతంటి ప్రాముఖ్యం ఉన్న సదస్సుకి తెలంగాణకి అహ్వనం రావడం పట్ల మంత్రి కె.తారక రామా రావు సంతోషం వ్యక్తం చేశారు.   140 దేశాలనుంచ ప్రతినిధులు హజరయ్యే ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను ప్రపంచం ముందు ఉంచే అవకాశముంటుందని, ఈ సదస్సు ద్వారా ఏవిధంగా అంతర్జాతీయ కంపెనీలను తెలంగాణకి అహ్వనించవచ్చో తెలుసుకునే వీలు కలుగుతుందని మంత్రి కె.తారక రామా రావు తెలిపారు.

మరోవైపు సోమవారం మెదక్‌ , కరీంనగర్‌ జిల్లాల పర్యటనకి మంత్రులు కె.తారక రామారావు- హరీష్‌ రావులు కలిసి రానున్నారు. మిడ్‌ మానేరు మరియ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులపై సవిూక్ష జరపనున్నరు. పంచాయితీరాజ్‌ మంత్రి కేటీఆర్‌, నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీష్‌ రావుతో కలిసి కరీంననగర్‌ జిల్లాలో పలు అభివృధ్ది కార్యక్రమాలకి శంఖుస్ధాపన చేయనున్నారు. మెదట సిద్దిపేట మండలంలో చేరుకుని పుల్లూరు మండలంలో జరిగే పలు అభివృధ్ది కార్యక్రమాల్లో పాల్గోంటారు. తర్వతా ముస్తాబాద్‌ మండలం మద్దికుంటలో బహిరంగ సభలో పాల్గోంటారు. మద్యహ్ననం రెండు గంటలకి  నర్మాలా ఇరిగేషన్‌ గెస్టహౌస్‌ లో మిడ్‌ మానేరు మరియ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులపై సవిూక్ష నిర్వహిస్తారు. మిడ్‌ మానేరు ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం గతంలో హైదరాబాద్లో సాగునీటి  శాఖ  మంత్రి, అధికారులతో చర్చింన మంత్రి… ఈ సవిూక్షా సమావేశంలో ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు విూద అధికారులతో చర్చించనున్నారు.