యూపిఎస్సీలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం

రాహుల్‌ ట్వీట్‌
న్యూఢిల్లీ,మే22(జ‌నం సాక్షి ): యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్మాణాన్ని సమూలంగా మార్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. రాష్టీయ్ర స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)కు నచ్చిన అధికారులతో యూపీఎస్‌సీని నింపేయాలనుకుంటోందని దుయ్యబట్టారు. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. దీనికి ఓ ప్రభుత్వ లేఖను కూడా జత చేశారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ఆధారంగా ఎంపికైన ప్రొబేషనర్స్‌కు సర్వీస్‌ అలకేషన్‌, కేడర్‌ అలకేషన్‌ను ఫౌండేషన్‌ కోర్స్‌ తర్వాత చేస్తే ఎలా ఉంటుంది? అనే ఈ ప్రభుత్వ లేఖను రాహుల్‌ తన ట్వీట్‌కు జత చేశారు. విద్యార్థులూ! మేలుకోండి! విూ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది! ధర్మబద్ధంగా విూదైనదానిని ఆరెస్సెస్‌ కోరుకుంటోంది. పరీక్షల ర్యాంకింగ్‌లకు బదులుగా, వ్యక్తిగత విధానాన్ని ఉపయోగించి మెరిట్‌ లిస్ట్‌ను మాయ చేయడం ద్వారా సెంట్రల్‌ సర్వీసుల్లోకి ఆరెస్సెస్‌కు నచ్చిన అధికారులను నియమించాలని ప్రధాన మంత్రి చేస్తున్న ఆలోచనను ఈ క్రింది లేఖ వెల్లడిస్తుంది’ అని ఆ ట్వీట్‌లో రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. అయితే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) జారీ
చేసిన ఈ లేఖలో ఆరెస్సెస్‌ అనే పదం లేదు.
——————–