యూపిలో వారంపాటు స్వాతంత్య్ర దినోత్సవాలు

పోరాట యోధుల ప్రదేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
ఖచ్చితంగా ప్రజలు, అధికారులు పాల్గొనేలా చర్యలు

లక్నో,జూలై16(జనం సాక్షి ): స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నందున ప్రతీ జిల్లాలో ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమంగా ఈ స్వాతంత్య దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు యూపి ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో పంద్రాగస్టును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహించనున్నారు. తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే ఆగస్టు 15న విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును రద్దు చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్యర్ర వచ్చి ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తి కానుంది. కాగా, వారోత్సవాల్లో ప్రతీరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో యూపీలో స్వచ్చ భారత్‌లో భాగంగా స్వాతంత్య పోరాట యోధులకు సంబంధించిన ప్రదేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడిరచారు. ఇందులో భాగంగానే అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఎన్‌సీసీ, స్కౌట్‌ విద్యార్ధులతో పాటు స్వచ్ఛంద సంస్థలను, వ్యాపార సంస్థలను కూడా ఇందులో పాల్గొనేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపడతామని, దీనిని జాతీయ ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలన్నారు. ఇకపోతే ఇప్పటికే యూపిలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పుడల్లా అక్కడ బుల్‌డోజర్లు రంగంలోకి దిగుతున్నాయి. పోలీసులకన్నా ముందు అవి రోడ్లవిూదికొస్తున్నాయి. ఇతర రాష్టాల్లోన్రి బీజేపీ ప్రభుత్వాలు సైతం ఈ విషయంలో యూపీని ఆదర్శంగా తీసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్లు న్యాయమైనవనీ, వాటిని ప్రభుత్వం బేఖాతరు చేస్తున్నదనీ భావించి నప్పుడు ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే ఈ పేరుతో కావాలనే ఆస్తుల విధ్వంసం జరుగుతోంది. కానీ హింసకు, విధ్వంసానికి దిగడం క్షమార్హం కాని నేరం. ఇలాంటి చర్యలవల్ల అంతిమంగా తామే నష్టపోతామని ఆందోళనకారులు
తెలుసుకోవాలి. సమాజంలో అశాంతి సృష్టించాలనీ, అలజడులు రేపాలనీ కుట్రలు పన్నే అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తామని ప్రభుత్వాలంటే అభ్యంతరపెట్టేవారు ఉండరు. నిందితులుగా ముద్రపడినవారి ఇంటి నిర్మాణాలు స్థానిక మున్సిపల్‌ సిబ్బందికో, జిల్లా అధికార యంత్రాంగానికో హఠాత్తుగా చట్టవిరుద్ధమైనవిగా కనబడతాయి. నోటీసిచ్చి 24 గంటలు గడవకుండానే, వారికి సంజాయిషీ ఇచ్చే వ్యవధి ఇవ్వకుండానే ఇళ్లను బుల్‌డోజర్‌తో కూల్చేస్తారు. బుల్‌డోజర్‌లు ఉపయోగించి ఇళ్లు, దుకాణాలు నేలమట్టం చేసే పోకడలను సవాల్‌ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులోనూ, అలహాబాద్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టుల్లోనూ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అయితే అసాంఘిక శక్తుల అణచివేతను ప్రజలుకూడా స్వాగతించడం విశేషం.